సినిమా వార్తలు

చైతూ, సమంత లేకుండానే ‘మజిలీ’?


1 year ago చైతూ, సమంత లేకుండానే ‘మజిలీ’?

సమంత, చైతూ పెళ్లి తరువాత వీరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లిద్దరికి తగిన కథను 'శివ నిర్వాణ' సిద్ధం చేసి ఒప్పించారు. ఇంతకుముందు 'నిన్నుకోరి' సినిమాతో యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్న ఆయన, సమంత .. చైతూలకి సెట్ అయ్యే ఒక కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడు. ఈ సినిమాకి 'మజిలీ' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారట. అయితే ప్రస్తుతం సమంత, చైతూ స్పెయిన్ లో వున్నారు. అక్కడి నుంచి వచ్చాక షూటింగ్ మొదలవుతుందని అనుకున్నారు. కానీ శివ నిర్వాణ ఆల్రెడీ ఫస్టు షెడ్యూలును ఆరంభించారని భోగట్టా. టైమ్ సేవ్ అవుతుందనే ఉద్దేశంతో సమంత .. చైతూ కాంబినేషన్ సీన్స్ కాకుండా వేరే ఆర్టిస్టులతో ఉన్న సీన్స్ చకచకా షూటింగు కానిచ్చేస్తున్నారట. వచ్చేనెల 3వ వారంలో సమంత - చైతూ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ సినిమాను ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను నిర్మించిన షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘నిన్ను కోరి’ లాంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ను అందించిన శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తన్నాడు. పెళ్లి తరవాత భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్థలు వచ్చాయని కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది .  గోపి సుందర్ మ్యూజిక్ అందించనున్నాడు. మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ పేర్లు త్వరలోనే వెల్లడించనున్నారని తెలుస్తోంది.