సినిమా వార్తలు

సోనాలీని క‌లుసుకున్న మ‌హేష్ వైప్‌


11 months ago సోనాలీని క‌లుసుకున్న మ‌హేష్ వైప్‌

బాలీవుడ్‌తోపాటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోనూ చాలా సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా నిలిచింది సోనాలీ బింద్రే. చిరంజీవి, బాలకృష్ణ‌, నాగార్జున‌, మ‌హేష్ బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో సోనాలి న‌టించింది. సోనాలి ప్ర‌స్తుతం కేన్స‌ర్ చికిత్స అందుకుంటూ న్యూయార్క్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న‌ `మ‌హ‌ర్షి` షూటింగ్ కూడా ప్ర‌స్తుతం న్యూయార్క్‌లోనే జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ భార్య న‌మ్ర‌త  సోనాలీని క‌లిశారు. `సోనాలీతో కాసేపు స‌ర‌దాగా గ‌డిపాను. త‌న అనారోగ్యానికి సంబంధించిన చాలా విష‌యాలు ఆమె నాకు చెప్పారు.

కేన్స‌ర్ చికిత్స తీసుకుంటున్న‌ప్ప‌టికీ సోనాలీ చాలా ఫిట్‌గా ఉన్నారు. ఆమె దృఢ‌మైన మ‌హిళ‌. ఆమె నాతో చాలా విష‌యాలు చెప్పారు. మేమిద్ద‌రం సెంట్ర‌ల్ పార్క్‌లో వాకింగ్ చేయాల‌నుకున్నాం. కానీ కొన్ని ప‌నుల వల్ల నాకు కుద‌ర‌లేదు. త్వ‌ర‌లో మ‌ళ్లీ కలుస్తాన‌ని, సెంట్ర‌ల్ పార్క్‌లో వాకింగ్‌కు వ‌స్తాన‌ని సోనాలీకి మాటిచ్చాను. నేను మ‌ళ్లీ సోనాలీని క‌లుస్తాన‌`ని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌మ్ర‌త తెలిపారు.