సినిమా వార్తలు

మహేష్ 'మహర్షి' అమెరికా షెడ్యూలు రద్దు!


11 months ago మహేష్ 'మహర్షి' అమెరికా షెడ్యూలు రద్దు!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' అమెరికా షెడ్యూల్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. వీసా కారణాల వల్ల అమెరికా ప్రయాణం రద్దైందని తెలుస్తోంది. దీంతో ఈ షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ను డెహ్రాడూన్ లో ముగించుకుంది. 25 రోజుల షెడ్యూల్ కోసం అమెరికాకు వెళ్లాల్సిన తరుణంలో వీరి ప్రయాణం రద్దయ్యింది. ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. మహేష్ బాబుకి ఇది 25వ చిత్రం కావడంతో 'మహర్షి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది. వీసా స‌మ‌స్య‌ల‌తో "మ‌హ‌ర్షి" షూట్ ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. అంద‌రికీ ఒకేసారి వీసా క్లియరెన్స్ రావ‌డానికి టైమ్ ప‌డుతుంది. గ‌తంలో చాలా సినిమాల‌కు ఇదే స‌మ‌స్య వ‌చ్చింది. ప్ర‌భాస్ "సాహో"తో పాటు.. చిరంజీవి "సైరా".. అఖిల్ మూడో సినిమా.. అప్ప‌ట్లో ఎన్టీఆర్ "నాన్న‌కు ప్రేమ‌తో".. ఆ త‌ర్వాత "నేనొక్క‌డినే".. ఇలా చాలా సినిమాలు వీసా స‌మ‌స్య‌ల‌తో చిక్కుల్లో ప‌డ్డాయి. మ‌రి ఈ వీసా స‌మ‌స్య‌లు ఎప్ప‌టికి తీరుతాయో వేచి చూడాలి‌.