సినిమా వార్తలు

మహేశ్ సరసన కత్రినా?


9 months ago మహేశ్ సరసన కత్రినా?

ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానుల దృష్టి ఆయన 25వ సినిమా 'మహర్షి'పైనే వుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు  కూడా జరిగిపోతున్నాయి. మహేశ్ 26వ సినిమా సుకుమార్ తో ఉండనుంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు సుకుమార్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో కథానాయికగా కత్రినా కైఫ్ ను తీసుకునే ఆలోచనలో టీమ్ ఉందని సమాచారం. ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కెరియర్ ఆరంభంలో కత్రినా తెలుగులో 'మల్లీశ్వరి'తో హిట్ కొట్టింది. ఆ తరువాత  బాలకృష్ణతో 'అల్లరి పిడుగు' చేసిన ఆమె, హిందీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మహేశ్ సినిమా కోసం మళ్లీ ఆమెను టాలీవుడ్ కి తెచ్చే ప్రయత్నాల్లో సుకుమార్ బిజీగా వున్నాడని సమాచారం.