సినిమా వార్తలు

బాలయ్య ను కలవనున్న మహేష్ ..ఎందుకో?


11 months ago బాలయ్య ను కలవనున్న మహేష్ ..ఎందుకో?

NTR బయోపిక్ షూటింగ్ లో బాలయ్య బాబు తలమునకలై ఉన్నారు. అందులోని నటీ నటుల ఎంపిక విషయంలో ,దర్శకుడు క్రిష్ తో కలసి చాల శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు నందమూరి, అక్కినేని కుటుంబంలోని నేటి తరం హీరోలను వారి పెద్దల పాత్రలకై ఎంపిక చేయటం జరిగింది, ఈ నేపధ్యం లో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర లో కూడా, ఆయన వారసుడైన మహేష్ ను నటింపచేసే ఉద్దెశంతో బాలయ్య మహేష్ ను ఫోన్ లో సంప్రదించారట. అయితే మహేష్ దానికి అంగీకరించకపోవడం తో , బాలయ్య మహేష్ ను స్వయంగా కలిసి ఒప్పించే ప్రయత్నం చేసే ఉద్దెశం లో ఉన్నాడట. 

NTR , కృష్ణ కలిసి ఎన్నో చిత్రాల్లో నటించినా, కాల క్రమేణా, అల్లూరి సీతారామరాజు చిత్రం కారణంగా వారి మధ్య విభేదాలు తలెత్తాయని అంటుంటారు. ఆ తరువాత కృష్ణ తన స్టూడియో కోసం స్థలం అడగగా ఎన్టీఆర్ మంజూరు చేయలేదని కూడా భోగట్టా. ఇలాంటి వైరి ని చూపిస్తారా ,లేక ఈ చిత్రం లో వారి మైత్రిని మాత్రమే చూపిస్తారా అనేది కూడా తెలియవలసి ఉంది. ఇక మహేష్ ఆ పాత్ర కి ఒప్పుకుంటాడా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన విషయమే. మహేష్ 'మహర్షి' షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నాడు. అతను తిరిగి రాగానే బాలయ్యని కలుస్తాడట. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.