సినిమా వార్తలు

మహర్షి తరువాత మహేష్ ప్లాన్ ఇదే!


3 months ago మహర్షి తరువాత మహేష్ ప్లాన్ ఇదే!

‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్‌’ సినిమాలతో హ్యాట్రిక్‌ సాధించారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఆయన లేటెస్ట్‌గా వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌తో తెరకెక్కించిన ‘ఎఫ్‌ 2’ వంద కోట్ల క్లబ్‌లో చేరి, మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఈ దర్శకుడు ఇండస్ట్రీలో హాట్‌ ఫేవరెట్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. ఈ యంగ్‌ డైరెక్టర్‌ నెక్ట్స్‌ ఎవరితో సినిమా చేయబోతున్నారు అంటే మహేశ్‌బాబు అనే సమాధానం ఫిల్మ్‌నగర్‌ సర్కిల్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా చేస్తున్నారు. దీనికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ‘మహర్షి’ పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి సినిమా స్టార్ట్‌ కానుందట. అయితే ఆల్రెడీ సుకుమార్‌తో సినిమాకి మహేశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మరి.. ‘మహర్షి’ తర్వాత మహేష్ ప్లాన్ ఏమిటి? సుకుమార్‌ సినిమానా? లేక అనిల్‌ రావిపూడితోనా? అనేది త్వరలోనే వెల్లడికానుంది.