సినిమా వార్తలు

మ‌హ‌ర్షికి ఎన్నిక‌ల గండం?


3 months ago మ‌హ‌ర్షికి ఎన్నిక‌ల గండం?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లిల కాంబినేషన్ లో సిద్ధం అవుతున్న సినిమా మహర్షి. అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఓ పల్లెకు రావడం, మహర్షిలా మారడం, ఇలాంటి క‌థ‌తో సినిమా న‌డుస్తుంది. కాగా అత్యంత దనవంతుడైన వ్యాపారవేత్త కోట్ల నష్టపోయి మహర్షిలా మారిన పాయింట్ తో యండమూరి ఎప్పుడో మహర్షి అనే నవల రాసారు. ఆ సంగ‌తి అలావుంచితే తాజాగా మహర్షి విడుదలకు ఏప్రియల్ 25న ముహుర్తం పెట్టారు. అయితే అప్పుడు ఆ సినిమాకు ఇబ్బంది అవుతుందేమోన‌ని చాలామంది అంటున్నారు.. ఎందుకంటే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు త్వరలో వెలువ‌డ‌బోతోంది..

ఆంధ్రలో ఏప్రియల్ 20 నుంచి 30 మధ్యనో లేదా 20 నుంచి మే ఫస్ట్ వీక్ మధ్యనో ఎన్నికల హడావుడి ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. కీలకప్రచారం ఏప్రియల్ ఆఖరివారంలోనే వుండొచ్చని అంచనాలున్నాయి. ఎన్నికల టైమ్ లో సినిమాలకు పెద్దగా గిరాకీ వుండదని ఇప్పుడే  ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈసారి ఆంధ్ర ఎన్నికలు  అన్ని పార్టీల‌కు కీల‌కం కానున్నాయి.. మూడు పార్టీలకు ప్రచారానికి జనం కావాలి. సినిమాకు వెళ్తే జ‌నానికి ఖర్చు. అదే ప్రచారానికి వెళ్తే ఆదాయం. మరి మహర్షి డేట్ ను మారుస్తారా? లేక అనుకున్నడేట్ కే ముందుకు వెళ్తారా? అనేది వేచిచూడాలి.