సినిమా వార్తలు

రీషూట్ లో మహేష్ ‘మహర్షి’


7 months ago రీషూట్ లో మహేష్ ‘మహర్షి’

ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా 'మహర్షి' రూపొందుతోంది. భారీ బడ్జెట్ కావడంతో ఈ సినిమాకి అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు ముందువచ్చిన మహేశ్ నటించిన 'భరత్ అనే నేను' భారీ హిట్ కావడం వలన, ఆ తరువాత సినిమా కూడా ఆ స్థాయి హిట్ కావాలనే పట్టుదలతో మహేశ్ వున్నాడు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని  బావించారు. తరువాత ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు రాదని, జూన్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అనుకున్న పనులు పూర్తికాకపోవడంతో విడుదల వాయిదా అనే వార్తలు వచ్చాయి. అయితే కొన్ని సన్నివేశాలు అనుకున్నట్టుగా రాకపోవడంతో భావోద్వేగాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వలన అసంతృప్తికి లోనైన మహేశ్ బాబు, రీ షూట్ చేయమని చెప్పారట. అందుకే ఈ చిత్రం విడుదల తేదీ మారుతుందని అంటున్నారు.