సినిమా వార్తలు

‘మహర్షి’ చుట్టూ సందేహాల వెల్లువ


11 months ago ‘మహర్షి’ చుట్టూ సందేహాల వెల్లువ

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో 'మహర్షి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల చిత్రబృందం అమెరికాకు వెళ్లింది. అక్కడి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగిరానున్నారు. సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుందని సమాచారం. అయితే అమెరికాలో జరిగిన షెడ్యూల్ లో హాట్ బ్యూటీ పూజా హెగ్డే మిస్ అయిందా..? అనే అనుమానాలు ముసురుకుంటున్నాయి.

పూజా హెగ్డే తను పాల్గొనే సినిమా షూటింగ్ లకి సంబంధించి ఆన్ లొకేషన్ ఫోటోలను ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటుంది. కానీ ఈసారి 'మహర్షి' షూటింగ్ కి సంబంధించి ఒక్క ఫోటో కూడా షేర్ చేయకపోవడం విశేషం. 'మహర్షి' గోవా షెడ్యూల్ కి సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసిన బ్యూటీ అమెరికా షెడ్యూల్ కి సంబంధించి ఎలాంటి ఫోటోలను పోస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ప్రభాస్ సినిమా కోసం ఇటలీ వెళ్లినప్పుడు ఆమె అక్కడ లైవ్ ఫోటోలను షేర్ చేసింది. అలానే 'అరవింద సమేత' వర్కింగ్ స్టిల్స్ ని ఆన్ లొకేషన్ నుండి షేర్ చేస్తుండేది. కానీ మహర్షి అమెరికా షెడ్యూల్ కి సంబంధించి ఫోటోలు షేర్ చేయకపోవడంతో పూజా ఈ షెడ్యూల్ లో పాల్గొనలేదని భోగట్టా.  మరోవైపు ఈ సినిమాలో మహేష్ స్టూడెంట్ గా, రైతుగా, సాఫ్ట్ వేర్ కంపనీ ఎండీగా కనిపించనున్నారని సమాచారం.