సినిమా వార్తలు

యూఎస్‌లో మహేష్ ఈవెంట్ రద్దు


11 months ago యూఎస్‌లో మహేష్ ఈవెంట్ రద్దు

అమెరికాలో సినీతారలపై ఉండే క్రేజ్ అంతకంతకూ పడిపోతోందట. గతంలో మాదిరిగా వారు వస్తుంటే అభిమానులు ఎగబడిపోవడం లేదట. ఇంతకుముందు టాలీవుడ్ తారల్ని చూసేందుకు, వారు పాల్గొనే కార్యక్రమాల్లో అవకాశం కోసం యుఎస్ జనాలు చాలా ఆసక్తిని ప్రదర్శించేవారు. సినీ తారలతో ఏవైనా ఎటువంటి ఈవెంట్లు చేసినా, ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా మంచి స్పందన లభించేది.

దీంతో ఇటువంటి కార్యక్రమాల బాగానే ఆదాయం సమకూరేది. కానీ ఈ మధ్య ఈ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలుస్తోంది. ‘మా’ కోసం మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న ఓ కార్యక్రమానికే రెస్పాన్స్ సరిగా రాలేదని తెలుస్తోంది. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ కొన్ని నెలల కిందట తలపెట్టిన మ్యూజికల్ కన్సెర్ట్ కూడా ఫెయిలైందట.  దీంతో నిర్వాహకులు నష్టాలు ఎదురయ్యాయని సమాచారం.

తాజాగా మహేష్ బాబుతో ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం తలపెట్టారు. దీనికి ముందు 2 వేల డాలర్లు టికెట్ రేటు పెట్టారని తెలుస్తోంది. దీనికి కూడా జనాల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో తర్వాత రేటు తగ్గిస్తూ వచ్చారు. అందులో నాలుగో వంతు కన్నా తక్కువ రేటు పెట్టినా కూడా ఆశించిన స్థాయిలో టిక్కెట్లు అమ్ముడపోలేదట. దీంతో మొత్తంగా ఈ కార్యక్రమాన్నే రద్దు చేసినట్లు తెలుస్తోంది. మహేష్ లాంటి పెద్ద స్టార్ వస్తున్నాడంటే కనీస స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.