సినిమా వార్తలు

మహేష్... ఐటీ కంపెనీ సీఈవో


9 months ago మహేష్... ఐటీ కంపెనీ సీఈవో

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షికి సంబంధించిన కొత్త విషయం బయటకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ప్రిన్స్‌ స్టూడెంట్‌గా కన్పిస్తాడన్న విషయం తెలిసిందే. యూత్‌లుక్‌లో ఇప్పటికే మనసును దోచేస్తున్న మహేష్‌ పాత్రకు సంబంధించిన మరో కోణం ఉందని చెబుతున్నారు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పివిపి ముగ్గురు అగ్రనిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈచిత్రంలో మహేష్‌బాబు రిషి పాత్రలో అలరించనుంటే..రవి పాత్రలో అల్లరి నరేష్‌ కన్పిస్తారని తెలుస్తోంది.

ఈసినిమాకు సంబంధించిన షూటింగ్‌ షెడ్యూల్‌ వచ్చే నెల 15న ప్రారంభం కానుంది.. దాదాపు 25 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్‌ అమెరికాలో జరగనుంది. మహర్షిలో స్టూడెంట్‌ పాత్రలో కన్పించే మహేష్‌,, తాజా షెడ్యూల్‌లో మాత్రం ఒక పెద్ద ఐటి కంపెనీ సిఇఒగా దర్శనమిస్తారని సమాచారం. అందుకు సంబంధించిన సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యమైన 2 పాటలనుకూడ ఈ షెడ్యూల్‌లోనే పూర్తిచేయటానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. స్టూడెంట్‌ లుక్‌లో అదరగొట్టిన మహేష్‌.. సిఇఒ లుక్‌తో కూడ కేకపెట్టించడం ఖాయమని అభిమానులు అంటున్నారు.