సినిమా వార్తలు

జీఎస్టీ అధికారులకు మహేష్ చెల్లింపులు


7 months ago జీఎస్టీ అధికారులకు మహేష్ చెల్లింపులు

ప్రిన్స్ మహేష్ బాబుకి చెందిన హైదరాబాద్ లోని ఏఎంబీ మల్టీప్లెక్స్ సినిమాస్ రూ.35.66 లక్షల వస్తు, సేవల పన్నుని గురువారం నాడు చెల్లించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్ లపై జనవరి 1 నుండి తగ్గించిన పన్ను రేట్లను తగ్గించకుండా పాత పన్నురేట్లతోనే విక్రయిస్తున్నారని కేంద్ర జీఎస్టీ అధికారులు జరిపిన దాడులలో వెల్లడైంది. ఫలితంగా  అధికారులు కేసులు నమోదు చేశారు. జనవరి 1 నుండి ఈ నెల 5వరకు అధిక మొత్తం వసూలు చేసినట్లు నిర్ధారించారు. అలా వసూలు చేసిన పన్ను మొత్తం రూ.35.66 లక్షలుగా పేర్కొనగా.. ఆ మొత్తాన్ని ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం చెల్లించింది. జీఎస్టీ అధికారులు ఈ మొత్తాన్ని చట్టప్రకారం వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయనున్నారని తెలుస్తోంది.