సినిమా వార్తలు

గీతా ఆర్ట్స్ తో మహేష్ సినిమా!


10 months ago గీతా ఆర్ట్స్ తో మహేష్ సినిమా!

బ‌య‌టి హీరోల‌కు సినిమా అవకాశాలు కల్పిస్తూ ఓ మంచి సంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టుంది గీతా ఆర్ట్స్. ఇప్పుడు మ‌హేష్‌బాబుతో ఓ సినిమా చేయ‌డానికి గీతా ఆర్ట్స్ ప్లాన్ చేస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాతో మ‌హేష్ ఓ సినిమా చేయాల‌ని భావించాడు. ఈ ప్రాజెక్టు గీతా ఆర్ట్స్‌లోనే ఉండ‌బోతోందని తాజా సమాచారం. అయితే ఈ సినిమా సందీప్ సొంత కథతో తెరకెక్కడం లేదని తెలుస్తోంది. ఈసారి సందీప్ రెడ్డి బ‌య‌టి క‌థ‌తోనే సినిమా చేస్తాడ‌ని, అందుకు మ‌హేష్ కూడా ఓకే అన్నాడ‌ని ఫిల్మ్ నగర్ టాక్.

ఈ నేపథ్యంలో మహేష్ కోసం ఓ మంచి కథని రూపొందించే పనిలో గీత ఆర్ట్స్ ఉన్నట్టు సమాచారం. సందీప్ – మహేష్ శైలికి తగ్గ కథని ఎవరు అందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కతోంది. మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మరోవైపు, సందీప్ వంగా బాలీవుడ్ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే గీత ఆర్ట్స్ లో మహేష్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.