సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్‌పై మహేశ్ ఇంట్ర‌స్టింగ్ ట్వీట్


9 months ago ఎన్టీఆర్ బయోపిక్‌పై మహేశ్ ఇంట్ర‌స్టింగ్ ట్వీట్

‘ఎన్టీఆర్’ బయోపిక్‌ ట్రైలర్‌ యూట్యూబ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. అంచనాలను మించి ఈ ట్రైలర్ ప్రేక్షకాదరణ పొందుతోంది. 24 గంటల్లోనే 40 లక్షల మంది దీనిని వీక్షించారు. సామాన్యుల మొదలు సినీ ప్రముఖల వరకు అందరి నుంచి అనూహ్య స్పందన ద‌క్కుతోంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ట్రైల‌ర్ పై స్పందించారు. రోమాలు నిక్కబొడుచుకున్నాయంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌ పాత్రలోకి బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేసిన తీరు అద్భుతమంటూ ప్రశంసించారు. సినిమాలోని ప్రతీ అంశం, ప్రతి ఒక్కరూ అపూర్వంగా కనిపిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌ విజయం సాధించాలంటూ.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా కోసం తాను ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నట్టు ఆ ట్వీట్ లో మహేశ్ పేర్కొన్నారు.