సినిమా వార్తలు

వెంకీ, వరుణ్‌లకు మహేశ్ అభినందనలు


8 months ago వెంకీ, వరుణ్‌లకు మహేశ్ అభినందనలు

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ సినిమా ‘F2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాపై  ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘F2 సినిమా చూశా. పూర్తి వినోదాత్మక చిత్రం. చాలా ఎంజాయ్‌ చేశా.. వెంకీ సర్‌ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు, అది చాలా ఫన్నీగా అనిపించింది‌. వరుణ్‌తేజ్‌ పాత్ర కూడా చాలా సరదాగా ఉంది. వెంకీ సర్‌ టైమింగ్‌కు వరుణ్ సరిగ్గా‌ సరిపోయాడు’ అని మహేశ్‌ ట్వీట్ లో పేర్కొన్నాడు. మహేశ్‌ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌, నవీన్ చంద్ర, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.