సినిమా వార్తలు

టీమిండియాకు మ‌హేష్ అభినంద‌న‌లు


6 months ago టీమిండియాకు మ‌హేష్ అభినంద‌న‌లు

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ద‌క్కించుకున్న‌ విషయం విదితమే. సిడ్నీలో జ‌రిగిన చివ‌రి టెస్ట్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ భార‌త్ ఖాతాలో చేరింది. ఆసీస్ గడ్డపై టీమిండియా ఈ ఘన విజయాన్ని సాధించడంతో దేశమంతా కోహ్లీసేనపై ప్రశంసల వ‌ర్షం కురుస్తోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు టీమిండియా సాధించిన విజయంపై ట్విట్టర్ వేదికగా ఆనందోత్సాహాలు వ్య‌క్తం చేశారు. ‘అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు టీం ఇండియాకు అభినందనలు. జాతి మొత్తం నిజంగా గర్వించదగిన క్షణం ఇది’ అంటూ మహేష్ పేర్కొన్నారు.