సినిమా వార్తలు

న్యూఇయ‌ర్‌కి మ‌హ‌ర్షి విషెస్‌


9 months ago న్యూఇయ‌ర్‌కి మ‌హ‌ర్షి విషెస్‌

సినీ ప్రియులకు నూతన సంవత్సర కానుకలు దండిగానే అందుతున్నాయి. ఇప్పటికే అప్‌డేట్స్ ఇస్తామని జెర్సీ, వినయ విధేయ రామ చిత్రబృందాలు ప్రకటించాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘మహర్షి’ నుంచి కూడా కొత్త లుక్‌ను విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు వంశీ పైడిపల్లి వెల్ల‌డించారు. ‘రిషి’తో మీ అపాయింట్‌మెంట్ ఫిక్స్‌ అయ్యింది. అతడి ప్రయాణంలో భాగం అవ్వండి’ అంటూ పోస్టర్‌లో చిత్రబృందం పేర్కొంది. ఈ విషయమై వంశీ.. ‘‘మహర్షి’ రెండో లుక్‌.. రిషితో కలిసి న్యూఇయర్‌ వేడుకను జరుపుకోండి. అని పేర్కొన్నారు.