సినిమా వార్తలు

‘మహర్షి’ కథ లీక్?


8 months ago ‘మహర్షి’ కథ లీక్?

మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. అశ్వనీదత్, దిల్ రాజు పీవీపీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో మహేశ్ శ్రీమంతుడిగా కనిపించనున్నాడట. ఆయన స్నేహితుడిగా అల్లరి నరేశ్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. పేదవాడైన స్నేహితుడి కోసం తన ఆస్తిపాస్తులను పక్కన పెట్టేసి, విదేశాల నుంచి ఇండియాలోని ఓ మారుమూల పల్లెటూరికి మహేశ్ బాబు వచ్చేస్తాడని సమాచారం. అలా వచ్చి తన స్నేహితుడినే కాదు, ఆ ఊరునే బాగు చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. పురాణకాలంలో శ్రీమంతుడైన కృష్ణుడిని పేదవాడైన కుచేలుడు ఆశ్రయించగా, ‘మహర్షి’ కథలో కుచేలుడు వంటి మిత్రుడిని వెతుక్కుంటూ శ్రీమంతుడైన హీరో వస్తాడనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా చివరి షెడ్యూల్ పొల్లాచ్చిలో ప్రారంభమైంది. అక్కడ చిత్రీకరించే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది.