సినిమా వార్తలు

‘మహర్షి' రీషూట్?


1 year ago ‘మహర్షి' రీషూట్?
మహేశ్ బాబు కొత్త చిత్రంగా 'మహర్షి' రూపొందుతోంది. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా. అందువలన మహేశ్ అభిమానుల అంచనాలను అందుకునేలా వంశీ పైడిపల్లి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ ను రీసెంట్ గా దర్శక నిర్మాతలు, మహేశ్ బాబు కలిసి చూశారట. కీలకమైన కొన్ని సన్నివేశాలు తాను ఆశించినట్టుగా రాలేదంటూ మహేశ్ బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది. దాంతో దర్శకనిర్మాతలు అందుకు అంగీకరించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హిందిలో కూడా భారీ రేటు పలికిందని తెలుస్తుంది. మహర్షి సినిమా హింది డబ్బింగ్ రైట్స్ పాతిక కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారట. ఈమధ్య తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది.  చరణ్, బోయపాటి సినిమా కూడా హింది రైట్స్ గా 22 కోట్లు పలికిందట. ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ మహేష్ మహర్షి ఏకంగా 25 కోట్లకు అమ్ముడయ్యిందని తెలుస్తుంది. తెలుగు డబ్బింగ్ సినిమాలు హిందిలో బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాదు యూట్యూబ్ లో కూడా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే అంత రేటు పెట్టి మరి కొనేస్తున్నారు.