సినిమా వార్తలు

'మహర్షి' శాటిలైట్ హక్కులకు భారీ రేటు


9 months ago 'మహర్షి' శాటిలైట్ హక్కులకు భారీ రేటు

మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, విదేశాల్లోనే ఎక్కువభాగం చిత్రీకరణను జరుపుకుంటోంది. మహేశ్ కి ఇది 25వ సినిమా కావడంతో, అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకే వంశీ పైడిపల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా శాటిలైట్ హక్కులకు గట్టిపోటీ ఏర్పడిందని సమాచారం. ఫ్యాన్సీ రేటుగా పెద్ద మొత్తం చెల్లించి శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ ఛానల్ కూడా అధికారికంగా ధృవీకరించింది. అల్లరి నరేశ్ ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.