సినిమా వార్తలు

యూఎస్ఏ లో 119 లొకేషన్స్ లో 'మహానాయకుడు'


7 months ago యూఎస్ఏ లో 119 లొకేషన్స్ లో  'మహానాయకుడు'

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగమైన 'మహానాయకుడు' సినిమాను ఈ నెల 22వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, అనుకున్నది సాధించేవరకూ సాగించిన పోరాటంతో పాటు మహానాయకుడిగా ఎదిగిన తీరును ఈ భాగంలో చూపించనున్నారు. యూఎస్ఏ లో ఈ సినిమా ప్రీమియర్ షోలను ఈ నెల 21వ తేదీన 119 లొకేషన్స్ లో ప్రదర్శించనున్నారు. ఈ భాగంలో చంద్రబాబు నాయుడుగా రానా చేసిన పాత్ర హైలైట్ గా నిలుస్తుంద‌ని చెప్పుకుంటున్నారు. ఇక హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించనున్నారు. మొద‌ట‌ వచ్చిన 'కథానాయకుడు' ఆశించినస్థాయిలో ఆదరణ పొందకపోవడంతో, 'మహానాయకుడు' నిడివి విషయంలో క్రిష్ ప‌లు జాగ్రత్తలు తీసుకున్నార‌ట‌. మ‌రి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో వేచి చూడాలి.