సినిమా వార్తలు

పవన్ పిలుపు కోసం మాధవీలత వెయిటింగ్‌


11 months ago పవన్ పిలుపు కోసం మాధవీలత వెయిటింగ్‌

సినీ నటీనటుల అడుగులు రాజకీయాల వైపు పడుతున్న విషయం విదిత‌మే. ఇటీవల సినీనటి మాధవీలత బీజేపీలో చేరారు. కానీ ఆమెకు పవన్ కల్యాణ్ అంటే చాలా అభిమానం. ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. కానీ ఆమె రాజకీయాల విషయానికి వచ్చేసరికి జనసేనను కాకుండా బీజేపీని ఎంచుకున్నారు. అయితే తాను బీజేపీలో ఉన్నా పవన్‌పై ఉన్న అభిమానం మాత్రం తగ్గదని స్ప‌ష్టం చేసింది.

తనకు చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానమని మాధవీలత తెలిపారు. పవన్ వ్యక్తిత్వం, ఆలోచనా విధానంపట్ల తాను ఆకర్షితురాలినయ్యానని ఆమె వెల్లడించారు. పవన్ నుంచి పిలుపు వస్తే మాత్రం జనసేన విషయమై ఆలోచిస్తానని వెల్ల‌డించారు. బీజేపీలో జాతీయ పార్టీ కాబట్టి ఎంతో నేర్చుకునే అవకాశముంటుందనే ఆ పార్టీలో చేరానని మాధవీలత తెలిపారు.