సినిమా వార్తలు

ర‌వితేజ‌తో మాధ‌వ‌న్ ఫైట్స్‌


7 months ago ర‌వితేజ‌తో మాధ‌వ‌న్ ఫైట్స్‌

తెలుగు .. తమిళ భాషల్లో మాధవన్ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించడంలో ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన విలన్ పాత్రలు చేయడానికి కూడా సై అంటున్నారు. ఇటీవల వచ్చిన 'సవ్యసాచి' సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమాకి సక్సెస్ లభించకపోవడంతో, ఆయన పాత్రకి రావలసినంత గుర్తింపు ద‌క్క‌లేదు. అయినా నిరాశ పడకుండా ఆయన మరోమారు విలన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధమవుతున్నారు. రవితేజతో దర్శకుడు వీఐ ఆనంద్ చేయనున్న సినిమాలో విలన్ పాత్ర కోసం మాధవన్ ను సంప్రదించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.