సినిమా వార్తలు

తన పొట్టితనంపై మాధవీలత దిమ్మతిరిగే సమాధానం


11 months ago తన పొట్టితనంపై మాధవీలత దిమ్మతిరిగే సమాధానం

టాలీవుడ్ నటి మాధవీలత కొందరు నెటిజన్లపై మండిపడింది. తాను పొట్టిగా ఉన్నానని కొందరు విమర్శించడంపై ఫేస్ బుక్ లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమధ్య ఆమె శ్రీనగర్ కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పొల్గొంది. అనంతరం దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు ‘మాధవీలత పొట్టిది’ అంటూ కామెంట్లు చేయసాగారు. ఈ కామెంట్లపై స్పందించిన మాధవీలత ‘నేను శ్రీనగర్ కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నా. దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశాను. అయితే కొంతమంది పొట్టిది..పొట్టిది అని కామెంట్లు చేస్తున్నారు. అవునురా బై.. నేను పొట్టిగనే ఉంటా. నీకేమైనా ఎక్కడన్నా నొప్పి వచ్చిందా? నీకేమయినా మాయరోగం వచ్చిందా? నీకేమయినా పోయేకాలం వచ్చిందా? లేదు కదా. మీ అమ్మ, మీ అక్కా, మీ చెల్లి అంతా పొడవుగానే ఉన్నారు కదా. ఇంక హ్యాపీగా ఉండు. నాకు లేనిది మీకున్నందుకు సంతోషించండి.

నామీద పడి ఎందుకు ఏడుస్తారు? నేను పొట్టిగా ఉండటం వల్ల ఎవడికైనా నొప్పివస్తే చెప్పండి. ఆ నొప్పికి వెళ్లి ఆసుపత్రిలో చూపించుకోండి. లేదంటే అది శాడిస్టిక్ రోగం అనుకుంటా. వెళ్లి ట్రీట్‌‌మెంట్ తీసుకో. ఫోటో పెడితే నచ్చితే నచ్చింది.. లేదంటే నచ్చలేదు అని చెప్పాలి. నేను పొట్టిదాన్నే.. నేను నల్లగా ఉంటా. అయితే నీకేంటి? నీకు నచ్చకపోతే నా పేజ్ నుంచి వెళ్లిపో’ అని ఫేస్ బుక్ లైవ్ లో దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చింది.