సినిమా వార్తలు

పాకిస్థాన్ కళాకారులపై జీవిత‌కాల‌పు నిషేధం


7 months ago పాకిస్థాన్ కళాకారులపై జీవిత‌కాల‌పు నిషేధం

పాకిస్థాన్ కళాకారులపై అల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ జీవిత‌కాల‌పు నిషేధం విధించింది. పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంద‌ర్బంగా జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. మానవత్వం లేకుండా జరిపిన ఇటువంటి దారుణ ఘటన వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. 'పాకిస్థాన్ నటీనటులు, కళాకారులూ చిత్ర పరిశ్రమలో పనిచేయడాన్ని నిషేధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తున్నాం. దీన్ని ఉల్లంఘిస్తూ ఏ సంస్థ అయినా పాకిస్థాన్ కళాకారులతో కలసి పనిచేస్తే ఏఐసిడబ్ల్యూఏ ఆ సంస్థపై కూడా నిషేధం విధిస్తుంది. దాంతో పాటు కఠిన చర్యలు చేప‌డుతుంది. దేశమే ముందు... మా దేశానికి అండగా ఉంటాం' అని ఏఐసిడబ్ల్యూఏ జనరల్ సెక్రెటరీ రోనాక్ సురేష్ జైన్ ఈ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పలు ఫిల్మ్‌ అసోసియేషన్స్‌ పాక్‌ కళాకారుల్ని నిషేధించాయి. పాకిస్థాన్ వారితో కలిసి పనిచేయకూడని, కాదని వారిని తీసుకుంటే ఆ సినిమా షూటింగ్‌ ఆపేసి, సెట్‌ను నాశనం చేస్తామని ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ పండిత్ వెల్ల‌డించారు.