సినిమా వార్తలు

మన్మథుడు లాంచింగ్ డేట్ ఫిక్స్!


7 months ago మన్మథుడు లాంచింగ్ డేట్ ఫిక్స్!

నాగ్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలలో 'మన్మథుడు' ఒకటిగా నిలుస్తుంది. విందుభోజనంలాంటి ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'మన్మథుడు 2' రూపొందుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్దంకానుంది. అయితే ఈ సినిమాను ఎప్పుడు లాంచ్ చేస్తారా? అని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా  ఎదురుచూస్తున్నారు. మార్చి 12వ తేదీన దీనికి ముహూర్తం కుదిరినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కథాపరంగా ఈ సినిమా షూటింగ్ యూరప్ నేపథ్యంలో కొనసాగుతుంది. అందువలన 2 నెలలపాటు అక్కడ షూటింగును ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమాకి, త్వరలోనే కథానాయికను ఎంపికచేయనున్నారని సమాచారం.