సినిమా వార్తలు

విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’...‘వెన్నుపోటు’


5 months ago విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’...‘వెన్నుపోటు’

ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లోని ‘వెన్నుపోటు’ పాటను ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రచయిత సిరాశ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు కల్యాణి మాలిక్ లకు తన ధన్యవాదాలు తెలియజేశారు. ‘దగా...దగా.. మోసం..నమ్మించి.. వెన్నుపోటు పొడిచారు. వంచించి..వంచించి వెన్నుపోటు పొడిచారు. కుట్ర..కుట్ర..కుట్ర..’ అంటూ ఈ పాట భావావేశంతో కొనసాగింది. ఈ పాట ప్లే అవుతుండగా ఆనాడు ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి ఉన్న పలు దృశ్యాలు కనపడటం విశేషం.