సినిమా వార్తలు

జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ల‌క్ష్మీపార్వ‌తి షాకింగ్ కామెంట్స్‌


10 months ago జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ల‌క్ష్మీపార్వ‌తి షాకింగ్ కామెంట్స్‌

జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ల‌క్ష్మీపార్వ‌తి సంచల‌న కామెంట్లు చేశారు. నందమూరి ఫ్యామిలి కి సంబంధించిన అంత‌ర్గ‌త విష‌యాల‌ను బయటపెట్టడంలో ముందుండే లక్ష్మీ పార్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కూడా తక్కువ వాడేమీ కాదంటూ ఆమె చేసిన కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఆమె ఒక‌ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో విడుద‌లైంది. అందులో లక్ష్మీ పార్వతి జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలను బయటపెట్టినట్లు స‌మాచారం. జూనియర్ ఎన్టీఆర్ ను... సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు తానే పిలిపించాను అని చెప్పారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తన ఫోటో చింపి పడేశాడ‌ని భావోద్వేగంతో చెప్పారు. అంతే కాకుండా ఎన్టీఆర్ ఏమీ తక్కువ కాదు. అత‌నికి మినహాయింపు ఏమి లేద‌న్నారు. అలాగే ఎన్టీఆర్ తల్లి తరచు తనకు ఫోన్ చేసి అత్తయ్యగారూ అని పిలిచేవార‌ని చెప్పారు.  ఇక లోకేష్ కి ఏ భాషా కూడా రాదని, పది లక్షలు పెట్టి తెలుగు నేర్పించారని లక్ష్మీ పార్వ‌తి కామెంట్ చేశారు. జగన్ తన కొడుకుతో సమానం అంటూ ఆయన ఏపీ ఎన్నిక‌ల్లో తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నాన‌ని తెలిపారు.