సినిమా వార్తలు

'లక్ష్మీస్ ఎన్టీఆర్' లోనే అసలు నిజాలు: లక్ష్మీ పార్వతి


8 months ago 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లోనే అసలు నిజాలు: లక్ష్మీ పార్వతి

హీరో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందింది. తొలి భాగమైన  'కథానాయకుడు' అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కావడంతో, థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. తాజాగా ఈ సినిమాపై లక్ష్మీపార్వతి స్పందించారు. "ఎన్టీఆర్ బయోపిక్ ను చూడమని నన్నెవరూ ఆహ్వానించలేదు. చంద్రబాబు కనుసన్నలలోనే ఈ బయోపిక్ రూపొందించారు. అందువలన ఎన్టీఆర్ కి సంబంధించిన పూర్తి వాస్తవాలు తెరకెక్కే అవకాశం లేదు. ఈ కారణంగానే జనంలోనూ .. నిజమైన అభిమానుల్లోను ఈ సినిమాపై అంతగా ఆసక్తి లేదు. అందరూ కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల కోసమే ఎదురుచూస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఎన్టీఆర్ బయోపిక్ ను రూపొందించే ధైర్యం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి మాత్రమే వుంది. అసలు నిజాలు అందులోనే ఉంటాయి" అని ఆమె వెల్లడించారు.