సినిమా వార్తలు

‘వినయ విధేయ రామ’ ఆడియో వేడుకకు కేటీఆర్?


9 months ago ‘వినయ విధేయ రామ’ ఆడియో వేడుకకు కేటీఆర్?

రామ్ చరణ్ కథానాయకుడుగా డైరైక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన పబ్ సెట్ లో షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ లో చరణ్ సరసన బాలీవుడ్ నటి ఇషా గుప్తా డాన్స్ చేయనుంది. ఇదిలావుండగా యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ నెల 24 లేదా 27వ తేదీల్లో ఏదొక రోజున ‘వినయ విధేయ రామ’ సినిమా ఆడియో వేడుకను ఆర్భాటంగా నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.

అయితే ఈ చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిథులుగా రాజమౌళి, ఎన్టీఆర్ తో పాటు కేటీఆర్ కూడా వస్తారని సమాచారం. దానయ్యనే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కూడా నిర్మస్తుండడంతో ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారట. అలాగే కేటీఆర్ కి, చరణ్ కి మంచి సాన్నిహిత్యం ఉన్న కారణంగా కేటీఆర్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారట. జనవరి 11వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలాభాగం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్. సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్, స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.