సినిమా వార్తలు

కంచరపాలెం టీమ్‌కు కేటీఆర్ సాయం


8 months ago కంచరపాలెం టీమ్‌కు కేటీఆర్ సాయం

గత ఏడాది తక్కువ బడ్జెట్ తో రూపొంది, సినీ ప్రేక్షకులను మెప్పించిన చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం'. గత సంవత్సరం విడుదలైన చిన్న సినిమాల్లో ఘన విజయాన్ని సాధించిన చిత్రంగా 'కేరాఫ్ కంచరపాలెం' నిలిచింది. ఈ చిత్రాన్ని ఓ ఎన్నారై నిర్మించారన్న కారణంతో, జాతీయ అవార్డుల బరిలో నిలిచేందుకు అర్హత లేదంటూ అవార్డుల నిర్వాహక కమిటీ తెలిపింది. ఇక విషయాన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ నేత కేటీఆర్, కేంద్రమంత్రి రాజ్ వర్ధన్ సింగ్ రాథోడ్ తో స్వయంగా మాట్లాడగా, ఈ సినిమాను కూడా పరిగణనలోకి తీసుకునేందుకు అధికారులు అంగీకరించారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఎండీ పరుచూరి, తమకు సహకరించిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.