సినిమా వార్తలు

సీక్వెల్ బాటలో 'క్షత్రియ పుత్రుడు'


11 months ago సీక్వెల్ బాటలో 'క్షత్రియ పుత్రుడు'

కమలహాసన్ కెరియర్లో పలు సినిమాలు చెప్పుకోదగినవిగా నిలిచాయి. ఆ సినిమాలు భారీ విజయాలను నమోదు చేయడమే కాకుండా, ఆయన క్రేజ్ ను మరింతగా పెంచేశాయి. అలాంటి సినిమాలకు సీక్వెల్ చేయడానికి కమలహాసన్ ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల 'విశ్వరూపం 2' సినిమాను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన 'భారతీయుడు' సినిమా సీక్వెల్లో చేయడానికి రెడీ అవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా సీక్వెల్ కి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన 'క్షత్రియపుత్రుడు' సీక్వెల్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారని సమాచారం. 'దేవరమగన్' పేరుతో తమిళంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. 'భారతీయుడు 2' తరువాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని కమల్ తెలిపారు. మొత్తానికి కమల్ మూడవ సీక్వెల్ కి కూడా సిద్ధమవుతున్నారన్న మాట.