సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ లో కేవీ రెడ్డిగా క్రిష్


10 months ago ఎన్టీఆర్ బయోపిక్ లో కేవీ రెడ్డిగా క్రిష్

ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరిగిపోతోంది. ఈ సినిమాలోని ముఖ్య పాత్రలలో క్రేజీ ఆర్టిస్టులు ఉన్న కారణంగా ఈ ప్రాజెక్టు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా దర్శకుడి క్రిష్ ఈ సినిమాలో ఆయన దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కేవీ రెడ్డి ఆణిముత్యాల్లాంటి పలు సినిమాలను తెరకెక్కించారు. ఈ ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం వుందని చెబుతుంటారు. తిరుగులేని దర్శకుడిగా వెలుగొందిన కేవీ రెడ్డి, చివరిదశలో ఆర్థికపరమైన అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకి ఎన్టీఆర్ సాయం అందించారు. ఆ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారని సమాచారం. 'మహానటి' సినిమాలో దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో క్రిష్ కనిపించిన విషయం విదితమే. జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.