సినిమా వార్తలు

మోక్షజ్ఞను పరిచయం చేయనున్న క్రిష్?


9 months ago మోక్షజ్ఞను పరిచయం చేయనున్న క్రిష్?

బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా తెలుగు తెరకి పరిచయమయ్యే రోజుకోసం నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞతో ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక ముఖ్యమైన రోల్ చేయిద్దామని గతంలో అనుకున్నారు. అయితే సోలో హీరోగానే మోక్షజ్ఞను పరిచయం చేస్తే బాగుంటుందని భావించిన బాలకృష్ణ ఆ ఆలోచనను విరమించుకున్నారట. ప్రస్తుతం మోక్షజ్ఞ నటన, డాన్స్, హార్స్ రైడింగ్ లలో శిక్షణ పొందుతున్నాడని తెలుస్తోంది. ఈ లోగా బాలకృష్ణ మంచి కథ వెతికే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. మోక్షజ్ఞను లాంచ్ చేసే అవకాశం కోసం చాలామంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. అయితే దర్శకుడు క్రిష్ కి .. బాలకృష్ణకి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. క్రిష్ పనితీరుపై బాలకృష్ణకి నమ్మకం కలిగింది. ఇక మోక్షజ్ఞను లాంచ్ చేయాలనే ఆసక్తి కూడా క్రిష్ కి వుందని సమాచారం. దంతో మోక్షజ్ఞ మొదటి సినిమాను క్రిష్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.