సినిమా వార్తలు

అల్లు అర్జున్ తో జతకట్టనున్నకైరా అద్వాని?


11 months ago అల్లు అర్జున్ తో జతకట్టనున్నకైరా అద్వాని?

గత కొంతకాలంగా అల్లు అర్జున్ కి చెప్పుకోదగిన హిట్ పడలేదు. దాంతో ఈ సారి తాను చేసే సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నారని సమాచారం. కొంతమంది దర్శకులు కథలు వినిపించినా, ఆయన ఆ ప్రాజెక్టులపై పెద్దగా ఆసక్తిని చూపలేదని తెలుస్తోంది. 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో తనకి రెండు హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారనేది తాజావార్త. అందుకోసమే 'అరవింద' పూర్తయ్యేవరకూ వెయిట్ చేశారట. త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి అంగీకరించడంతో, అందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కైరా అద్వానిని ఎంపిక చేయనున్నారని అంటున్నారు. గతంలో మహేశ్ తో కలిసి 'భరత్ అనే నేను' చేసిన కైరా .. ప్రస్తుతం చరణ్ తో నటిస్తోంది. అల్లు అర్జున్ జోడీగా ఆమె ఎంపిక దాదాపు ఖరారైపోయిందనే వార్త గుప్పుమంటోంది.