సినిమా వార్తలు

150 కోట్ల క్లబ్ లోకి 'కేజీఎఫ్'


9 months ago 150 కోట్ల క్లబ్ లోకి 'కేజీఎఫ్'

కన్నడ రాక్ స్టార్ యశ్ కథానాయకునిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్'ను రూపొందించారు. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక. గత నెల 21వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కన్నడ, హిందీలోను ఈ సినిమా అత్యధిక స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. బంగారు గనుల మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇంతవరకూ హిందీ వెర్షన్ ద్వారా 26 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 150 కోట్లను రాబట్టింది. ఈ సినిమాతో యశ్ రేంజ్ పూర్తిగా మారిపోనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ వాస్తవానికి దగ్గరగా ఈ కథను ఆవిష్కరించడంతోపాటు ప్రతి పాత్రను సహజత్వంతో మలిచిన తీరు, యశ్ నటన ఈ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ ను తెచ్చిపెట్టాయనే టాక్ వినిపిస్తోంది.