సినిమా వార్తలు

మరో అడుగు ముందుకేసిన కీర్తి సురేష్


9 months ago మరో అడుగు ముందుకేసిన కీర్తి సురేష్

తెలుగు, తమిళ భాషల్లో నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు అనగానే నయనతార, అనుష్కల పేర్లు గుర్తొస్తాయి. ఈ ఇద్దరూ అందుబాటులో లేకపోతే త్రిషను ఎంపిక చేసుకుంటున్నారు. మిగతా సీనియర్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ కథ భుజాన వేసుకుని నడిపించడానికి వాళ్లు ధైర్యం చూపడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో కెరియర్ తొలినాళ్లలోనే 'మహానటి' సినిమా చేసిన కీర్తి సురేశ్ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ మరో అడుగు ముందకు వేశారు. మహానటి సినిమా తరువాత ఇక నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను కీర్తి చేయకపోవచ్చని అంతా అనుకున్నారు. అందుకు భిన్నంగా ఆమె నాయిక ప్రాధాన్యత కలిగిన మరో సినిమాను అంగీకరించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు నిర్మించనున్న ఓ సినిమాలో కీర్తి సురేశ్ ను ఎంపిక చేశారు. తాజాగా ఈ ప్రాజెక్టును హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.