సినిమా వార్తలు

రజనీకాంత్ సరసన కీర్తి సురేశ్?


9 months ago రజనీకాంత్ సరసన కీర్తి సురేశ్?

రజనీకాంత్ కథానాయకుడిగా 'పెట్టా' రూపొందుతోంది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు మురుగదాస్ తో కలిసి రజనీ సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతో మురుగదాస్ బిజీగా వున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో రజనీ సరసన జోడీ కట్టేది కీర్తి సురేశ్ అనే వార్త బయటికి రావడం ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ యంగ్ హీరోయిన్స్ తో జోడీకట్టక చాలా కాలమైంది. తన వయసుకి తగిన పాత్రలనే ఇటీవల ఆయన చేస్తూ వస్తున్నారు. అలాంటి ఆయన తాజా చిత్రంలో కథానాయికగా కీర్తి సురేశ్ పేరు తెరపైకి రావడం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. కీర్తి సురేశ్ కి ఇంత త్వరగా రజినీతో నటించే అవకాశం దక్కడం అదృష్టమంటున్నారు.