సినిమా వార్తలు

మరో తెలుగు సినిమాలో కీర్తి సురేశ్


9 months ago మరో తెలుగు సినిమాలో కీర్తి సురేశ్

ఈ ఏడాది ‘మహానటి’కీర్తి సురేశ్ కి బాగా కలిసొచ్చింది. తెలుగులో ఆమె చేసిన 'మహానటి' ఆమెకి అమోఘ విజయంతో పాటు ఎన్నో ప్రశంసలను తెచ్చిపెట్టింది. తమిళంలో చేసిన 'పందెం కోడి 2' .. 'సర్కార్' అక్కడ భారీ విజయాలను నమోదుచేసింది. తెలుగులోనూ ఈ సినిమాలు భారీ వసూళ్లనే సాధించాయి. 'మహానటి' తరువాత నాయికి ప్రాధాన్యత కలిగిన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయట. అయితే కొంతకాలం పాటు హీరోలతో జోడి కట్టే పాత్రలను మాత్రమే చేయాలని కీర్తి నిర్ణయించుకున్నారని సమాచారం.

అయితేనాయికి ప్రాధాన్యత కలిగిన ఒక కథను చేయడానికి ఆమె ఒప్పుకుందట. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా తెలుగులో రూపొందనుంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనే విషయంతో పాటు, మరిన్నివివరాలను త్వరలోనే వెల్లడి కానున్నాయి. కొత్త సినిమాకు కీర్తి సురేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటే దానిలో అద్బుతమైన కంటెంట్ ఉంటుందనుకోవచ్చు.