సినిమా వార్తలు

నిత్య బాటలో కీర్తి... తగ్గుతున్న అవకాశాలు?


1 year ago నిత్య బాటలో కీర్తి... తగ్గుతున్న అవకాశాలు?

హీరోయిన్లకు గ్లామర్ తో పాటు టాలెంట్ కూడా ముఖ్యమనే విషయం తెలిసిందే. ఈ రెండింట్లో ఏది లేకపోయినా కెరీర్ ఎక్కువ కాలం కొనసాగదనే విషయం విదితమే. గ్లామర్ ఉండి టాలెంట్ లేకపోయినా, టాలెంట్ ఉండి చక్కటి శరీర సౌష్టవాన్ని కోల్పోయినా కెరీర్ ను కొనసాగించడం అంత సులభం కాదు. ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ పరిస్థితి కూడా ఇలాగేమారింది. 'మహానటి' సినిమాతో ఎంతో పేరు, అభిమానులను సంపాదించుకున్న కీర్తి ప్రస్తుతం నిరాశలో ఉందని సమాచారం. 'మహానటి' సినిమా సూపర్ హిట్ కావడంతో కీర్తి సురేష్ కు టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతాయని అందరూ అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ప్రస్తుతం ఆమె చేతిలో 'ఎన్టీఆర్' చిత్రం మాత్రమే ఉందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో కూడా ఆమె సావిత్రి పాత్రను పోషిస్తోంది. సినిమా అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో కీర్తి సురేష్ నిరాశకు లోనవుతోందట. కీర్తికి అవకాశాలు రాకపోవడానికి ఆమె బొద్దుగా తయారవడమే కారణమని అంటున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న నిత్యామీనన్ కూడా బొద్దుగా తయారై, సినీ అవకాశాలు చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా మరో నిత్యామీనన్ అవుతుందేమోనని అంటున్నారు. మరోవైపు, బొద్దు భామలను ఆదరించే తమిళ ఇండస్ట్రీలో మాత్రం కీర్తికి ఆఫర్లు బాగానే వస్తున్నాయని వినికిడి.