సినిమా వార్తలు

7న బెల్లంకొండ శ్రీ‌నివాస్ ‘క‌వ‌చం’


10 months ago 7న బెల్లంకొండ శ్రీ‌నివాస్ ‘క‌వ‌చం’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ ప్రధాన‌ పాత్రల్లో వ‌స్తున్న సినిమా ‘క‌వ‌చం’ డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ మామిళ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ చౌదరి సొంటినేని(నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తొలిసారి బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.