సినిమా వార్తలు

చెర్రీ సినిమాలో కీలక పాత్రలో కౌశల్!


1 year ago చెర్రీ సినిమాలో కీలక పాత్రలో కౌశల్!

ప్రేక్షకులను అమితంగా ఆక‌ట్టుకున్న‌ బిగ్‌బాస్ 2 రియాల్టీ షో ముగిసింది. కౌశల్ ఈ షోలో విన్నర్ అవడంతో పాటు లక్షలాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దీంతో వరుస సినీ అవకాశాలు ఆయన్ను వరిస్తున్నాయని స‌మాచారం. కౌశల్ షోలో ఉండగానే నందమూరి బాలకృష్ణకు విలన్‌గా అవకాశం వచ్చిందంటూ రూమర్స్ వినిపించాయి. తాజాగా రామ్ చరణ్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఓ కీలక పాత్రలో కౌశల్‌కు అవకాశం వచ్చిందని ఫిలింనగర్‌లో టాక్. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది. కౌశల్‌కు సామాజిక మాధ్యమాల వేదికగా సినీ ప్రముఖులు మారుతి, కోన వెంకట్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుండ‌గా సినిమా నిర్మాణం విషయంలో తెలుగులో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. కథ నచ్చిన కొంతమంది వ్యక్తులు కలిసి నిర్మాతలుగా మారుతున్నారు. లాభాలు వస్తే అంతా పంచుకుంటారు .. సినిమా ఆడకపోతే ఒక్కొక్కరిపై పడే నష్టం ప్రభావం తక్కువ. ఇటీవల 'మను' సినిమా కూడా అలాగే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా 'బిగ్ బాస్ 2'లో కౌశల్ ను గెలిపించిన కౌశల్ ఆర్మీ .. ఆయన కోసం నిర్మాతలుగా మారుతున్నారు. అంతా కలిసి 4 కోట్ల రూపాయలను పోగేసి ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో సినిమాల్లోను .. సీరియల్స్ లోను .. యాడ్స్ లోను నటించిన అనుభవం కౌశల్ కి వుంది. ఆయన సోలో హీరోగా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.