సినిమా వార్తలు

రాకుమారుడు గా కాంతారావు బయోపిక్


7 months ago రాకుమారుడు గా కాంతారావు బయోపిక్

తెలుగు చ‌ల‌న‌చిత్ర సీమ‌లో పౌరాణిక సినిమాల ద్వారా ఎన్టీఆర్, సాంఘికాల ద్వారా ఏఎన్నార్ తమదైన ముద్రవేయ‌గా,  జానపదాలపై కాంతారావు తనదైన ముద్ర వేసిన విష‌యం విదిత‌మే. జానపద చిత్రాల్లో కత్తి యుద్ధాలు ఉండ‌టం స‌హ‌జ‌మే. ఆ కత్తి యుద్ధాల్లో ఆరితేరిన కథానాయకుడిగా మార్కులు కొట్టేసిన కాంతారావును, అభిమానులు 'కత్తి కాంతారావు' అనే పిలుచుకునేవారు. అలాంటి ఘ‌న‌త క‌లిగిన‌ కాంతారావు జీవితచరిత్రను దర్శకుడు పీసీ ఆదిత్య సినిమాగా రూపొందిస్తున్నారు కాంతారావు జీవితంలోని వివిధ కోణాలను తెరపై ఆవిష్కరించడానికి ఆయన స‌న్నాహాలు చేస్తున్నారు. 'రాకుమారుడు' అనే టైటిల్ ను ఖరారు చేసిన ఆయన, పాటల రికార్డింగ్ ను పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం. త్వరలో రెగ్యులర్ షూటింగుకి వెళ్లడానికి కావ‌ల‌సిన ఏర్పాట్లు చేస్తున్నార‌ని భోగ‌ట్టా. కాంతారావు పాత్రకు గాను అఖిల్ సన్నీ అనే యువకుడిని ఎంపిక చేశారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. రాజనాల .. దర్శకుడు విఠలాచార్య .. కృష్ణకుమారి .. రాజశ్రీ .. పాత్రలకు  నటీనటుల ఎంపిక ఇంకా జర‌గాల్సివుంది.