సినిమా వార్తలు

క్రిష్‌, బాల‌కృష్ణ‌ల‌పై కంగ‌నా షాకింగ్ కామెంట్స్‌


9 months ago క్రిష్‌, బాల‌కృష్ణ‌ల‌పై కంగ‌నా షాకింగ్ కామెంట్స్‌

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు, దర్శకుడు క్రిష్ కు ‘మణికర్ణిక’ సినిమా విషయంలో త‌లెత్తిన వివాదం ఇంకా న‌డుస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా దీనికి బ్రేక్ పడినా.. తాజాగా మరోసారి క్రిష్‌పై కంగనా విమర్శలు గుప్పించింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ ప్రథమ భాగం ‘కథానాయకుడు’ ప్రేక్షకులను అంత‌గా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ‘మహానాయకుడు’పై మరింత దృష్టి సారించి ఇటీవలే విడుదల చేశారు. అయితే ద్వితీయ భాగం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం వెనకబడింద‌ని తెలుస్తోంది. దీనిని తెలుసుకున్న కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కలెక్షన్ల రిపోర్ట్‌ గురించి విన్నాను. క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణ సర్‌ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో నేను ‘మణికర్ణిక’ ప్రాజెక్టును చేప‌ట్టిన‌ప్పుడు..నేనేదో క్రిష్‌ను మోసం చేసినట్లు నాపై నిందలు వేసి రాంబదుల్లా నన్ను పీక్కుతిన్నారు. మరిప్పుడేమంటారు? అని ప్ర‌శ్నించింది. లాగే క్రిష్‌తో పాటు కొన్ని మీడియా వర్గాలు ‘మణికర్ణిక’పై దుష్ప్రచారం చేశాయ‌ని కంగన విమర్శలు కురిపించింది.