సినిమా వార్తలు

ఎన్టీఆర్'లో కల్యాణ్ రామ్ లుక్!


12 months ago ఎన్టీఆర్'లో కల్యాణ్ రామ్ లుక్!

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్ - కథానాయకుడు', 'ఎన్టీఆర్ - మహానాయకుడు'కు సంబంధించి మరో అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో హరికృష్ణగా ఆయన కుమారుడు కల్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. హరికృష్ణగా కళ్యాణ్‌ రామ్‌ ఉన్న ఫొటోను దసరా సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎన్టీఆర్ రూపంలోని బాలకృష్ణ ఠీవీగా కూర్చుని వుండగా, ఆయన పక్కనే హరికృష్ణగా, కల్యాణ్‌ రామ్‌ కనిపిస్తున్నారు. "విజయం మీది. విజయరథ సారధ్యం నాది. నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ" అంటూ ఓ డైలాగ్‌ ను కూడా పెట్టారు. కాగా, ఈ చిత్రం తొలి భాగం కథానాయకుడు జనవరి 9, మహానాయకుడు జనవరి 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే.