సినిమా వార్తలు

అభిమానుల కోసమే తారక్ ను తీసుకోలేదు: కల్యాణ్‌రామ్


8 months ago అభిమానుల కోసమే తారక్ ను తీసుకోలేదు: కల్యాణ్‌రామ్

ఎన్టీఆర్ బయోపిక్‌‌లో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో చైతన్య రథసారధిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అతడి పాత్ర నిడివి కూడా ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ పోషించిన రోల్ ఎక్కువగా రెండో భాగంలో కనిపిస్తుందని సమాచారం. కాగా కళ్యాణ్ రామ్... సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్(తారక్)ను ఎందుకు తీసుకోలేదో తెలిపారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సరైన సంబంధాలు లేవని గతంలో రూమర్స్ వినిపించాయి.  అదేవిధంగా ఎన్టీఆర్ బయోపిక్‌లో సైతం తారక్ లేక పోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

వీటిపై కళ్యాణ్ రామ్ స్పందిస్తూ ‘అటువంటి వార్తలు నేనూ విన్నాను. వాటిలో ఎలాంటి నిజం లేదు. ఇలాంటివి ఎలా వస్తాయో కూడా అర్థం కాదు. బయోపిక్ ఆడియో లాంచ్ ఈవెంట్ కు బాబాయ్ పిలిస్తే తమ్ముడు వచ్చాడు. బాబాయ్‌కి ప్రేమ ఉంది కాబట్టే పిలిచాడు. విబేధాలు లేవనడానికి ఈ ఒక్క సంఘటన చాలు' అన్నారు కళ్యాణ్ రామ్. అలాగే ‘తారక్ ఇపుడు సూపర్ స్టార్. బయోపిక్‌లో చిన్న పాత్ర ఇస్తే అతడి స్టార్ డమ్‌కు న్యాయం జరగదు. అభిమానులు కూడా డిసప్పాయింట్ కు గురవుతారు. ఇందులో తమ్ముడికి తగిన పాత్ర లేదు కాబట్టే లేడు. అంతకు మించి ఏమీ లేదని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు. 

కాగా  మహా నటుడు ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ బయోపిక్ ను రూపొందించారు. మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌ రెండో భాగం 'ఎన్‌.టి.ఆర్‌ మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. ఎన్‌బికె ఫిల్మ్స్ నిర్మాణంలో వారాహి చలన చిత్రం సమర్పణలో ఈ బయోపిక్ రూపొందింది. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.