సినిమా వార్తలు

హరికృష్ణ పాత్రకు సిద్ధమవుతున్న కల్యాణ్ రామ్


11 months ago హరికృష్ణ పాత్రకు సిద్ధమవుతున్న కల్యాణ్ రామ్

క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతున్న విషయం విదితమే. బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా వేగవంతంగా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బాలకృష్ణ .. రానా కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రెండురోజుల్లో ఈ సినిమా షూటింగులో కల్యాణ్ రామ్ జాయిన్ కానున్నాడు. ఈ సినిమాలో హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ చేయనున్నాడనే వార్త వినిపిస్తోంది. ఎన్టీ రామారావు రాజకీయ ప్రస్థానంలో హరికృష్ణ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ పాత్ర కోసమే కల్యాణ్ రామ్ ను ఎంపిక చేసుకున్నారు. బాలకృష్ణ- కల్యాణ్ రామ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ 25 రోజుల కాల్షీట్స్ ఇచ్చారని తెలుస్తోంది.