సినిమా వార్తలు

హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ ఇలా...


9 months ago హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ ఇలా...

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జీవితకథను ఆయన తనయుడు బాలకృష్ణ స్వయంగా నటిస్తూ తెరకెక్కించాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రెండు భాగాలుగా వస్తోంది. తాజాగా ఈ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెల 9న విడుదల కాబోతున్న ఈ సినిమా మేకింగ్ వీడియోను చిత్రబృదం విడుదల చేసింది.  ఆ వీడియోలో  హరికృష్ణ పాత్రలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా చిత్రీకరణ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.