సినిమా వార్తలు

‘కల్కి’ పోస్టర్ విడుదల


8 months ago ‘కల్కి’ పోస్టర్ విడుదల

రాజశేఖర్ కథానాయకునిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' సినిమా రూపొందుతోంది. సి. కల్యాణ్ ఈ సినిమాకి నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని, తాజాగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాజశేఖర్ ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పవర్ఫుల్ గా వుంటుందనే విషయం ఈ లుక్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మోషన్ పోస్టర్ తోనే ఆసక్తిని రేకెత్తించడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. 1983 నాటి నేపథ్యంలో ఈ కథ కొనసాగనుందనే విషయాన్ని మోషన్ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. 'గరుడవేగ' హిట్ తరువాత రాజశేఖర్ చేస్తోన్న సినిమా కావడంతో, అత్యధిక అంచనాలు నెలకొన్నాయి.