సినిమా వార్తలు

యుద్ధవిద్యను నేర్చుకున్న కాజల్‌


9 months ago యుద్ధవిద్యను నేర్చుకున్న కాజల్‌

శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'భారతీయుడు' సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీనియర్ కమలహాసన్ తనపై దాడికి దిగినవారిపై ఒక ప్రాచీన యుద్ధ విద్యను ప్రయోగించి మట్టి కరిపిస్తుంటాడ‌నే విష‌యం విదిత‌మే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా రానున్న 'భారతీయుడు 2'లోను 'వర్మకళ' (తమిళంలో వర్మకలై) అనే ప్రాచీన యుద్ధకళను గురించిన సన్నివేశాలు వుంటాయని స‌మాచారం. ఈ సినిమాలో కమల్ సరసన కథానాయికగా కాజల్ న‌టిస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాలో కాజల్ కూడా 'వర్మకళ'ను ప్రయోగిస్తార‌ని తెలుస్తోంది. అందుకే ఆమె ఈ ప్రాచీన యుద్ధకళను కాజల్ నేర్చేసుకుందని స‌మాచారం. కాజల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి చాలా త్వరగానే ఈ యుద్ధవిద్యను నేర్చుకుందనే టాక్ వినిపిస్తోంది. లైకా ప్రొడక్షన్స్  నిర్మిస్తోన్న ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంద‌ని తెలుస్తోంది.